పేజీ 1
అర్జున్ తన హోంవర్క్ పూర్తి చేశాడు. అది సూర్యుడు, ఒక చెట్టు ఉన్న బొమ్మ.
పేజీ 2
అర్జున్ దాన్ని ఆరడానికి మెట్టు మీద పెట్టి, నీళ్లు తాగడానికి లోపలికి వెళ్లాడు.
పేజీ 3
ఛోటు మేక అటుగా వచ్చింది. కాగితాన్ని వాసన చూసింది. నమ్, నమ్, నమ్!
పేజీ 4
ఒక్క మూల మాత్రమే మిగిలింది. దాని మీద సగం సూర్యుడు ఉన్నాడు.
పేజీ 5
బడిలో అర్జున్ “మేక నా హోంవర్క్ తినేసింది!” అని చెప్పాడు. క్లాసంతా నవ్వింది. ఎవరూ నమ్మలేదు.
పేజీ 6
అప్పుడే గడ్డానికి కాగితం అంటుకుని ఛోటు క్లాసులోకి వచ్చేసింది! ఇప్పుడు అందరూ అర్జున్ మాట నమ్మారు.