పేజీ 1
అర్జున్ విమానంలో లడఖ్ వెళ్లాడు. కొండలు గోధుమ రంగులో ఉన్నాయి, వాటి పైన తెల్లటి మంచు.
పేజీ 2
గాలి చల్లగా ఉంది. అర్జున్ రెండు స్వెటర్లు, ఉన్ని టోపీ, పెద్ద సాక్సులు వేసుకున్నాడు.
పేజీ 3
ఒక యాక్ అటుగా నడిచింది. దానికి ఒళ్లంతా జుట్టే! నడిచే దుప్పటిలా ఉంది!
పేజీ 4
ఒక ఊళ్లో, ఒక పాప అర్జున్కి ఒక కప్పు వేడి వెన్న టీ ఇచ్చింది. అది ఉప్పగా ఉంది!
పేజీ 5
గాలికి ప్రార్థన జెండాలు రెపరెపలాడుతున్నాయి: నీలం, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు.
పేజీ 6
ఆ రాత్రి ఆకాశం నిండా నక్షత్రాలు. అర్జున్ ఇన్ని నక్షత్రాలు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు!