పేజీ 1
చాలా కాలం క్రితం, అర్జున్ మహారాజు కోసం ఒక కొత్త ఆట తయారుచేశాడు. ఆ ఆట బల్ల మీద 64 గళ్లు ఉన్నాయి.
పేజీ 2
మహారాజుకి ఆట చాలా నచ్చింది. “ఏ బహుమతి కావాలన్నా అడుగు!” అన్నారు.
పేజీ 3
అర్జున్ అన్నాడు, “మొదటి గడిలో ఒక బియ్యం గింజ. తర్వాతి గడిలో రెండు. తర్వాత నాలుగు, తర్వాత ఎనిమిది.”
పేజీ 4
మహారాజు నవ్వారు. “బియ్యమేనా? తీసుకురండి!”
పేజీ 5
కానీ బియ్యం రెట్టింపు, రెట్టింపు అవుతూనే ఉంది. కొంచెం సేపటికే రాజ్యంలో ఉన్న బియ్యం అంతా కూడా సరిపోలేదు!
పేజీ 6
మహారాజు అర్జున్కి తల వంచి నమస్కరించారు. “నువ్వు చాలా తెలివైనవాడివి. ఇక, హాయిగా ఆట ఆడుకుందాం!”